కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లభించనుంది. ఈ నేపధ్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రకటించింది సీరమ్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు ధర రూ.400 గా ప్రైవేటు రంగం వారికి రూ.600 గా నిర్ణయించింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి రూ. 250 కే ఇవ్వనుంది సీరమ్ సంస్థ. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచుతామని సీరమ్ సంస్థ పేర్కొంది. ఉత్పత్తి సామర్థ్యంతో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని సీరమ్ సంస్థ తెలిపింది.