వినాయక చవితిపై హైద‌రాబాద్‌ సీపీ గైడ్ లైన్స్..!

-

క‌రోనా నేప‌థ్యంలో ఈ సారి మొహరం, గణేష్ పండుగ‌ల‌ను ఇంట్లోనే జ‌రుపుకోవాల‌ని హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లో పబ్లిక్ ప్లేసెస్‌లో విగ్రాహాలు పెట్టడానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతిలేదని తెలిపారు. ‘జాగ్రత్తలు పాటిస్తు మీఆరోగ్యాన్ని కాపాడుకోండి.. కరోనా నుండి మీకుటుంబాన్ని రక్షించండి.

ప్రజల ఆరోగ్యం, సంరక్షణే తమకు అన్నిటికన్నా ముఖ్యమైందని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు చేయవద్దని తెలిపిన ప్రభుత్వం ఆదేశాలను ప్రజలందరూ బాధ్యతగా పాటించాలన్నారు.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే కరోనా వ్యాప్తి దృష్ట్యా తమకు సహకరించని వారిపై చర్యలకు వెనుకాడబోమని తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్లు,శుభకార్యాలతో పాటుగా పండుగలపై కూడా అనేక ఆంక్షలు ఉంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news