చౌరాసియా ఘటనపై క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్

-

సీని నటి చౌరాసియా ఘటనపై సీపీ అంజనీ కుమార్ షాకింగ్‌ నిజాలు బయట పెట్టారు. ఈ ఘటనపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన… సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ… నటి చౌరాసియా పై దాడి కేసు లో నిందితున్ని అరెస్ట్ చేశామని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లైట్ మెన్‌ గా పనిచేస్తున్న బాబు ను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు.

బాబు కు గతం లో నేర చరిత్ర ఉందని.. గతంలో ఇలాంటి ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు సీపీ అంజనీ కుమార్‌. గోల్కొండ పోలీస్ స్టేషన్ లో గతంలో పలుమార్లు బాబు అరెస్ట్‌ అయ్యాడని వెల్లడించారు. చౌరాసియా పైన లైంగిక దాడికి యత్నం పాల్పడ్డాడని.. ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ కృష్ణా నగర్‌ లో బాబు నివాసం ఉంటున్నారని… పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు. నిందితున్ని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామన్నారు సీపీ అంజనీ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news