బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్..!

-

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం వరకు విస్తృతంగా నిర్వహించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొందరు పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ చేసిన కామెంట్స్‌పై చేశారు. ఈ వ్యాక్యలపై సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సంజయ్‌కు సీపీ చురకలంటించారు.

cp-sajjanar

ఇక సంజయ్‌పై లీగల్ ఒపీనియన్ ‌కు వెళ్తున్నామని, కేసులను పక్కాగా నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ.. నేరుగా నేతలు ఇంకో పార్టీ స్థావరాలపై దాడులకు దిగడం సరికాదని సీపీ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్, పోలీసు అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ టీఆర్ఎస్ గెలిచేందుకు సలహాలు ఇస్తోందన్నారు.

ఇక టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. డబ్బులు పంచుతున్న నాయకులపై కేసులు పెట్టకపోగా.. కొన్ని చోట్ల పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బండి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేసేందుకూ తాము వెనుకాడబోమని సంజయ్ స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తే డీజీపీ, ఈసీలే బాధ్యత వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news