ప్రార్థన మందిరాలలలో మాంసం..హరీష్ రావు సంచలన ఆరోపణలు !

Join Our COmmunity

ఫేక్ మీడియా నడపడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి వస్తుందని మంత్రి హరీస్ రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల  రోజు కాంగ్రెస్ అభ్యర్థి మన పార్టీలో చేరుతున్నట్టు ఓ ఛానెల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించి వదిలారని ఇప్పుడు కూడా, నేను, మన పార్టీ కీలక నేతలు మారినట్టు ప్రముఖ ఛానెళ్ల నకిలీ లోగోలతో వీడియోలు తయారు చేయించారని అన్నారు.

అంతే కాక ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్థన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు మళ్ళీ ఇక్కడ జరిగినట్లు తప్పుడు ప్రచారం చేయబోతున్నారని మనకు స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. ఈ బీజేపీ భాజపా సోషల్ మీడియాను ఫేక్ మీడియాగా మార్చిందని. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంతేకాక బీజేపీ ప్రస్టేషన్ లోకి వెళ్ళిందని అందుకే దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందని అన్నారు. అయినా సరే టీఆర్ఎస్ శ్రేణులు సంయమనంతో ఉండాలని అయన పిలుపునిచ్చారు. 

 

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...