కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

-

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. హామీని గాలికి వదిలేసారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో అప్రకటితో ఎమర్జెన్సీ నడుస్తుందని మండిపడ్డారు కూనంనేని. 9 ఏళ్లలో దేశంలో ఒక్క బీజేపీ నేతపై కూడా సిబిఐ, ఈడి కేసులు, దాడులు లేవని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బిజెపికి లొంగిపోతే ఈ కేసులు ఉండవని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు చేయాలని బయ్యారం నుంచి హనుమకొండ వరకు ప్రజా పోరు యాత్ర చేస్తామని వెల్లడించారు. ఈనెల 25 నుండి వచ్చేనెల 5వ తేదీ వరకు ఈ యాత్ర చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news