జమ్మూకాశ్మీర్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పలువురు జాతీయ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విభిన్న సిద్ధాంతాలు గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవంటూ గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం హేయమైన చర్యగా సీపీఐ (ఎం) పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ పేర్కొన్నారు. భాజపా మద్దతు ఉంటే ఒక చట్టం లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్ వ్యాఖ్యానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం అన్నారు.
సమైక్య స్ఫూర్తికి కేంద్ర తూట్లు పొడిచేలా వ్యవహరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో మెజారిటీ మద్దతు ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకుండా రాష్ట్ర భవిష్యత్ ని ఇరుకున పెట్టడం తగదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు పేర్కొన్నారు.