సందీప్ కిషన్ సొంత ప్రయత్నం

-

యువ హీరోల్లో అసలు ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకపడ్డాడు సందీప్ కిషన్. అందుకే మరో అడుగు ముందుకేసి నిర్మాతగా కూడా మారి మరో ప్రయత్నం చేస్తున్నాడు. తన టేస్ట్ కు తగ్గ కథతో ఈసారి పర్ఫెక్ట్ హిట్ టార్గెట్ తో వస్తున్నాడు సందీప్ కిషన్.

కార్తిక్ రాజు అనే తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన సందీప్ కిషన్ తనకు హిట్ ఇచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కలిసి వచ్చేలా వెంకటాద్రి టాకీస్ అనే బ్యానర్ స్థాపించి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ పవర్స్ తో సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఉంటుందట. నిర్మాతగా సందీప్ కిషన్ కొత్త అటెంప్ట్ చేస్తున్నాడని చెప్పొచ్చు.

మరి ఈ సొంత ప్రయత్నం ఏమేరకు మంచి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news