చరిత్రలో చంద్రబాబు పేరు చెరిపేయాలన్నదే వారి ఉద్దేశం : లోకేష్

ఏపీలో రాజధాని అంశం మరోసారి రాజుకున్న విషయం తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం హాట్ హాట్ గా మారిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు పర్వం కొనసాగుతోంది. అయితే తాజాగా జగన్ సర్కారు తీరు పై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గొప్ప సంకల్పం తో కట్టిన రాజధాని… అనవసరంగా ఎందుకు కూల్చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

అయితే మీరు ఊహించిన దానికంటే గత ప్రభుత్వం రాజధాని అద్భుతంగా నిర్మించింది అనే రాజధానిని ధ్వంసం చేయాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. లేదా అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతోనే అమరావతిని కూలకొడుతున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల ఏపి ప్రజల కల అంటూ వ్యాఖ్యానించిన నారా లోకేష్… ఆంధ్రులందరికీ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అంటూ డిమాండ్ చేశారు.