మోదీ విశాఖ పర్యటన కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు చలసాని శ్రీనివాస్. లక్షలాది మంది ప్రజలను సభకు బలవంతంగా తరలించారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం మాట్లాడలేదని.. మాట్లాడే నాయకులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమన్ని ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు చలసాని శ్రీనివాస్. ప్రాజెక్టులు అన్ని అధానీ పరమవుతున్నాయన్నారు.
విజయవాడ, విశాఖల్లో రైల్వే బడ్జెట్ లో ఒక్క రూపాయి ఇవ్వట్లేదన్నారు. బిజేపికి వైసిపి ప్రభుత్వం భజన చేయటానికే వుందని విమర్శించారు. గతంలో బిజెపిని తీవ్రంగా విమర్శించిన పవన్ ఇపుడు ఎందుకు ఇలా మారిపోయారని ప్రశ్నించారు. మోదీతో సమావేశం అనంతరం పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారని దుయ్యబట్టారు. వామపక్ష నాయకులను అరెస్టు చేస్తే పవన్ కనీసం ప్రశ్నించలేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై 26న డిల్లీలో దీక్షకు కూర్చుంటామన్నారు చలసాని శ్రీనివాస్.