క్రెడిట్ గేమ్: ఎవరు తగ్గట్లేదు?

-

రాజకీయాల్లో క్రెడిట్ గేమ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది…అంటే ప్రజలకు మేలు జరిగే పని ఒకటి జరిగితే…అది మా వల్ల జరిగిందని ఒక పార్టీ…లేదు లేదు మా వల్ల జరిగిందని మరొక పార్టీ చెబుతుంది. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా చేసిన అది అధికార పార్టీకి క్రెడిట్ దక్కుతుంది..కాకపోతే ఒకోసారి ప్రతిపక్షాల పోరాటాల వల్ల కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

ఇలా పోరాటాల వల్ల…ప్రభుత్వాలు కొన్ని పనులు చేస్తాయి…అప్పుడు క్రెడిట్ ప్రతిపక్షాలకు దక్కుతుంది. ఇక తాజాగా తెలంగాణలో ఉద్యోగాల విషయంలో ఎవరికి వారే క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లు దాటిన సరే కేసీఆర్..పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ తాజాగా నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవ్వడం, ప్రతిపక్షాలు సైతం నిరుద్యోగుల విషయంలో పోరాటాలు చేయడంతో…ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

సీఎం కేసీఆర్ అనూహ్యంగా…90 వేల పైనే ఉద్యోగాలని ప్రకటించిన విషయం తెలిసిందే…వెంటనే ఈ పోస్టులని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు..ఇక పెద్ద ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ వదలడంతో నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారు..అలాగే కేసీఆర్ కు పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు..దీంతో ఉద్యోగాల విషయంలో క్రెడిట్ మొత్తం తమదే అని టీఆర్ఎస్ చెబుతుంది. ఇదే సమయంలో బీజేపీ వర్షన్ వేరేగా ఉంది..తాము నిరుద్యోగుల కోసం పోరాటం చేయడం, త్వరలోనే మిలియన్ మార్చ్ పెట్టడానికి సిద్ధమవుతున్నాం కాబట్టే కేసీఆర్..సడన్ గా ఉద్యోగాలు ప్రకటన చేశారని బండి సంజయ్ అంటున్నారు…ఇదంతా తమ పోరాట ఫలితమే అని వారు చెబుతున్నారు.

అదే సమయంలో ఇదంతా తమ పోరాటం ఫలితమని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు..ఆ మధ్య నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ చేశామని, తమ యువ నేతలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్లే ఇదంతా జరిగిందని రేవంత్ అంటున్నారు. అంటే ఉద్యోగాల విషయంలో ఎవరికి వారు క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు. మరి చివరికి యువత ఎవరికి మద్ధతు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news