క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతీ అరెస్ట్

-

క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి అరెస్ట్ అయ్యాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ ల కు అండగా ఉన్న అమిత్ గుజరాతి. ఇతర రాష్ట్రంలో అమిత్ గుజరాతిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగానే Pt warrant మీద అమిత్ గుజరాతి ను హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు పోలీసులు.

దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద నెట్వర్క్ కలిగి ఉన్న అమిత్ గుజరాతి… ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.

దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్న అమిత్… గత కొన్నేళ్ళుగా బెట్టింగులు నిర్శహిస్తూ కోట్లు కొల్లగొట్టాడు. అయితే… పక్కా ఇన్ఫర్మేషన్ తో బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు అమిత్ గుజరాతీని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news