కూతురు ప్రేమ పెళ్లి..మనవడి నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కుక్కి అమ్మమ్మ దారుణం..!

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది అనే కోపం తో ఓ అమ్మమ్మ దారుణానికి పాల్పడింది. కూతురి పై కోపాన్ని మనవడిని హత్య చేసి తీర్చుకుంది. ఈ ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….కోయంబత్తూరు కు చెందిన నాగలక్ష్మి అనే మహిళ కూతురు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో కొంత కాలానికే విడిపోయారు.

అనంతరం కొడుకు దుర్గేష్(9 నెలలు) ను తీసుకుని పుట్టింటికి చేరుకుంది. అయితే కూతురు ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసింది అని…మనవడిని చంపేస్తే కూతురు కు మరో పెళ్లి చేయవచ్చని నాగలక్ష్మి భావించింది. దాంతో చిన్నారి నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కుక్కి హతమార్చింది. అనంతరం ఏమీ తెలియనట్టు పడుకోబెట్టింది. ఇక బాబుకి పోస్టుమార్టం చేయడం తో అసలు నిజం బయటపడింది. దాంతో కసాయి అమ్మమ్మ ను పోలీసులు అరెస్ట్ చేశారు.