హెయిర్ కట్ చేయలేదని దారుణంగా చంపాడు…!

చిన్న‌గొడ‌వ‌కు ఏకంగా ప్రాణాలు దీశాడు ఓ దుర్మార్గుడు. హెయిర్ క‌ట్ చేయ‌లేద‌ని త‌న వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం ఉత్త‌ర ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బులంద్ షహ‌ర్ లో ఇర్ఫాన్ అనే యువ‌కుడు సెలూన్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన స‌మీర్ అనే ఓ యువ‌కుడు రౌడీ షీట‌ర్ గా చ‌లామ‌నీ అవుతున్నాడు. స‌మీర్ కు ఇర్ఫాన్ గ‌త కొంత‌కాలంగా హెయిర్ క‌ట్ చేస్తున్నాడు. ఇక హెయిర్ క‌ట్ చేసిన ప్ర‌తీసారి డ‌బ్బులు నెక్స్ట్ టైమ్ ఇస్తా అంటూ చెబుతూ వ‌చ్చాడు.

అడిగిన ప్ర‌తిసారి అదే డైలాగ్ చెప్ప‌డం డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో విసిగిపోయిన ఇర్ఫాన్ బాకీ డ‌బ్బులు ఇస్తేనే క‌టింగ్ చేస్తా అంటూ తేల్చిచెప్పాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం నెల‌కొంది. మాటా మాటా పెరిగి గొడ‌వ పెద్ద‌దైంది. దాంతో త‌న వెంట తెచ్చుకున్న తుపాకీతో స‌మీర్ ఇర్ఫాన్ ను కాల్చి చంపాడు. అనంత‌రం అక్క‌డ నుండి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.