ఏపీలో విషాదం..ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే, విజయనగరంలోని.. భీమ సింగిలో నివసిస్తున్న బోనిమద్దిల జగదీశ్వరి పాత భీమ సింగి జంక్షన్ లో సెల్ పాయింట్ నిర్వహిస్తున్న చిన్ని కోటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిన్ని కోటిని పెళ్లి చేసుకోవాలని అతని కుటుంబ సభ్యులు జగదీశ్వరిని ఒత్తిడి చేశారు.

అయితే, జగదీశ్వరి పెళ్లికి నిరాకరించడంతో నీ వీడియోలు, రికార్డింగ్లు ఉన్నాయని బెదిరింపులకు దిగారు చిన్ని కోటి, అతని కుటుంబ సభ్యులు. దీంతో భయాందోళనకు గురైన జగదీశ్వరి..తమ గ్రామానికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

జగదీశ్వరి కొత్త భీమ సింగి గ్రామంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినది. చిన్ని కోటి వెన్నుపాడు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వాడు. కొన్నాళ్లు వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారని పోలీసులకు వివరించారు అతని స్నేహితులు. అటు జగదీశ్వరి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై తెలిపారు.