తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది. టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది. కేశవరెడ్డి పాఠశాలకు చెందిన సాత్విక్ మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు.
పాఠశాలలో ఉపాధ్యాయుడు చితక బాధడంతో అస్వస్థతకు గురవడంతో ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అయితే, సాత్విక్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇక పాఠశాల యజమాన్యం మాత్రం బెడ్ పై నుంచి పడడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని… అక్కడ మృతి చెందాడంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.