చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

ఏపీ పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ ను ఎట్ట‌కేల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ ప‌రిధిలో ఈ మ‌ధ్య కాలంలో చెడ్డీ గ్యాంగ్ క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో విజ‌య‌వాడ పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టి చెడ్డీ గ్యాంగ్ కోసం గాలించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ మూఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారి వివ‌రాల‌ను విజ‌య‌వాడ సీపీ కాంతి రాణా టాటా వెల్ల‌డించారు. అరెస్ట్ చేసిన వాళ్లు గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన మడియా కాంజీ మేడా , సక్రమండోడ్ , కమలేష్ బాబేరియా అని గుర్తించారు.

అయితే రాష్ట్రంలో దోపిడీ లు చేస్తున్న గ్యాంగ్ గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని అన్నారు. వీరిని గుజ‌రాత్ లోని దాహాద్ జిల్లా ఎస్పీ స‌హాయం తో అరెస్ట్ చేసామ‌ని అన్నారు. మ‌రో 7 గురు ప‌రారీ లో ఉన్నార‌ని తెలిపారు. వీరిని నుంచి దాదాపు 70 శాతం ప్రాపర్టీ రికవరీ చేసామ‌ని వెల్ల‌డించారు. ప‌రారిలో ఉన్న వారిని త్వ‌ర‌లో నే ప‌ట్టుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కాగ వీరి నుంచి 20,000 నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు.