మహిళలు ఒంటరిగా నడవలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు కామాంధులు దాడి చేస్తుంటే.. మరోవైపు రక్షించాల్సిన రక్షకులే దాడి చేయడం శోచనీయం. ఎల్బీనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోసం ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా అవి పేరుకు మాత్రమే ఉంటాయి. తప్ప అమలుకు నోచుకోవడం లేదు. మహిళల పట్ల ఎవ్వరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది పోలీసులే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే న్యాయం ఎవరినీ అడగాలి. రాత్రి మహిళ ఒంటరిగా కనిపిస్తే జాగ్రత్తలు చెప్పి పంపించాల్సిన పోలీసులే నకరకయాతన చూపించారు. రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై పోలీసులు జులుం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లడమే కాకుండా.. ఆమెపై రాత్రి అంతా థర్డ్ డిగ్రీని ఉపయోగించిన అమానుషకరమైన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ నంది హిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 4లో వరలక్ష్మీ నివాసం ఉంటుంది. వరలక్ష్మీ, భర్త శ్రీను కొన్ని నెలల క్రితమే చనిపోయాడు. వరలక్ష్మీ కూతురుంది. కూతురికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. వరలక్ష్మీ కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ రోడ్డు వైపులోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్లింది. డబ్బులు తీసుకొని ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ సర్కిల్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావని ప్రశ్నించారు. వరలక్ష్మీ వివరాలు చెప్పినా పోలీసులు వినలేదు.
నీ సంగతి తెలుసులే అంటూ పోలీస్ వాహనం ఎక్కాలని కోరారు. వరలక్ష్మీ తన కూతురు ఇంట్లో ఉందని నేను ఏ తప్పు లేదని కోరింది. అయినా పోలీసులు వినకుండా ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆమెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా.. రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు వాపోయింది. ఉదయం 7 గంటలకు ఇంటికి పంపించారని తెలిపింది. పోలీసులు తనపై ఎందుకు అలా అమానుషంగా ప్రవర్తించారో తెలియదని కన్నీరుమున్నీరు పెట్టింది.