డీజే విషయంలో ఘర్షణ.. కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఓ వర్గానికి చెందిన వారు.. మరో వర్గంపై కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి పెళ్లి అనంతరం డీజే సౌండ్ కి నృత్యాలు చేస్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ దాడిలో జిల్లేపల్లి నాగేంద్రరావు అతని భార్య వెంకట్రావమ్మ, కొడుకు గోపికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లేపల్లి నాగేంద్రరావు తలపై, చేతులపై కత్తెలతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉంది. చింతకాని పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.