భర్తకు విడాకులు ఇచ్చి ఆంటీ ఒంటరి జీవితం, అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులతో!

తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ తాలూకా వలరుపురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) దుబాయ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో తనతో పాటు పనిచేసే శ్రీలంకకు చెందిన రోహిణి వసంతి (41) నీ 2005 లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం తర్వాత తమ సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు.

అయితే రోహిణి పలువురు పురుషులతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పాటు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2017 నుంచి నెలకు రూ. 50 వేలు పిల్లల పోషణ కోసం కార్తికేయన్ చెల్లిస్తున్నాడు. కాగా, తిరువల్లూరు లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆమె టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది.

మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టైలర్ షాపులోనే ఆమెను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ పద్మశ్రీ బబ్బి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఈమె కమల కన్నన్ తో సహజీవనం చేస్తూనే మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. అక్రమ సంబంధాలే హత్యాయత్నానికి కారణమే ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.