అంబర్ పేటలో డ్రగ్ డీలర్ భరత్ అరెస్ట్

హైదరాబాద్ లోని అంబర్ పేటలో డ్రగ్ డీలర్ భరత్ ని అరెస్టు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అంబర్ పేటలో డ్రగ్స్ తీసుకు వెళుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భరత్ వద్ద నుంచి 15 గ్రాముల ఎండిఎంఎ ని స్వాధీనం చేసుకున్నారు. భరత్ అనే నేను గత కొన్ని సంవత్సరాలుగా సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు.

ఢిల్లీ, ముంబై, గోవా లాంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు భరత్. హైదరాబాద్ లో అత్యంత పురాతన డ్రగ్ డీలర్ గా భరత్ కి పేరు ఉంది. డ్రగ్ కొనుగోలు చేస్తున్న ఆరుగురు పాత కస్టమర్లను సైతం గుర్తించారు పోలీసులు. భరత్ అనే నిందితుడు హైదరాబాద్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ గా ఉన్నాడు. 2020 లోనే ఎక్సైజ్ అధికారులకు చిక్కాడు భరత్. గతంలోనే భరత్ ని అరెస్ట్ చేశారు. ఇతను హైదరాబాదులోనే అతిపెద్ద డ్రగ్ మాఫియాని నడుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.