జన్ మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ హనుమాన్ మాత్రే లకు ఈడి నోటీసులు

-

జన్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి ,సమీర్ హనుమాన్ మాత్రేలకు ఈడి నోటీసులు జారీ చేసింది. లోన్ ఆప్స్ నిధులను విదేశాలకు క్రీప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేసినట్టుగా ఈడి అధికారులు గుర్తించారు. లోన్ ఆప్ వ్యవహారం లో నోటీసులు ఇచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.

బిట్‌కాయిన్, లిట్‌కాయిన్, రిపుల్ వంటి డిజిటల్ కరెన్సీలలో ట్రేడింగ్ చేస్తోంది జాన్మై సంస్థ.
చైనీస్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై జరుగుతున్న మనీలాండరింగ్ విచారణలో జాన్ మై కంపెనీ లావాదేవీల గుట్టు రట్టు చేశారు ఈడీ అధికారులు. బెట్టింగ్ ద్వారా ఒచ్చిన డబ్బు ను క్రిప్టో కు మార్చింది జాన్ మై ల్యాబ్స్.క్రిప్టోకరెన్సీ గా మార్చడం ద్వారా 57 కోట్ల నేరానికి చైనీస్ కంపెనీస్ పాల్పడ్డట్టు ఆధారాలు సేకరించారు.

క్రిప్టోకరెన్సీ నీ బినాన్స్‌ వాలెట్ లకు బదిలీ చేసినట్టు ఈడి గుర్తించింది. బినాన్స్ వాలెట్ నుండి వాజిర్ x కు 880 కోట్ల క్రిప్టో కరెన్సీ డిపాజిట్ చేసి 1400 కోట్లు తిరిగి బినాన్స్ ఖాతా కు బదిలీ చేసినట్లు తెలిపారు. కంపెనీ ఆడిట్ లో ఈ లావాదేవీలను మాయం చేసారు డైరెక్టర్లు.వాజిర్‌ఎక్స్ క్లయింట్లు సరైన డాక్యుమెంటేషన్ విలువైన క్రిప్టోకరెన్సీలను బదిలి చేసినట్టు ఆధారాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news