రాత్రంతా ఆన్​లో గ్యాస్​ హీటర్.. ఊపిరాడక​ ఒకే కుటుంబంలో నలుగురు మృతి

-

రాత్రంతా గ్యాస్ హీటర్ ఆన్‌లో ఉండటం వల్ల ఊపిరాడక ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది. పాల వ్యాపారి వెళ్లి తలుపు తట్టగా అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీతాపుర్​లో ఆసిఫ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి జీవిస్తున్నాడు. ఆసిఫ్​ స్థానికంగా ఉండే ఓ మదర్సాలో క్లర్క్​గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే ఆదివారం ఉదయం పాల వ్యాపారి వెళ్లి వారింటి తలుపు తట్టగా.. లోపల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పలగకొట్టి చూడగా.. వారంతా నిద్రలోనే మృతి చెందినట్లు గుర్తించారు.

“శనివారం రాత్రి ఆసిఫ్ కుటుంబం గ్యాస్​ హీటర్​ను ఆన్​ చేసి నిద్రించారు. ఆ సమయంలో హీటర్​ నుంచి గ్యాస్ లీక్​ అయ్యింది. అదే సమయంలో నిద్రలో ఉన్న వారు ఆ గాలిని పీల్చుకున్నారు. దీంతో వారంతా మరణించారు” అని పోలీసు అధికారి బిశ్వా అభిషేక్​ ప్రతాప్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news