కూతురు శరీరంలో భార్య ఆత్మ ఉందని.. ఏం చేశాడో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

అత్యాధునీక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన∙తర్వాత కూడా ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముతూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగుతూనే ఉన్నాయి. రోబోలతో పనులు చేస్తున్న కాలంలోనూ దయ్యాలు, భూతాలు, ఆత్మలంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఓ తండ్రి, కూతురు శరీరంలో తన భార్య ఆత్మ ప్రవేశించిందని.. దాన్ని బయటకు పంపేందుకు చేసే పూజల్లో భాగంగా కన్న కూతురినే పొట్టన పెట్టుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

నడుము, మెడపై దాడి..

తమిళనాడులోని రామనాథపురం జిల్లా కేంద్రానికి చెందిన వీరసెల్వం అనే వ్యక్తి, తాంత్రీకపూజలు, చేతబడులు, మూఢ నమ్మకాలను నమ్ముతాడు. అయితే ఇటీవల సెల్వం కూతురు తరుణి(19) తీవ్ర అనారోగ్యానికి గురై మంచనపడింది. గత కొన్ని రోజుల క్రితం తరుణి తల్లి సమాధి వద్దకు వెళ్లివచ్చినప్పటి నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సెల్వం భావించి.. తన భార్య ఆత్మనే కూతురు శరీరంలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను సంప్రదించకుండా తానే తాంత్రీక పూజలుæ చేసేందుకు సిద్ధమయ్యాడు.

అందుకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధ చేసుకుని కూతురితో పూజలు మొదలు పెట్టాడు. ఆత్మను శరీరంలోంచి వెళ్లగొట్టాలని తరుణి నడుము, మెడపై దాడిచేసినట్లు సమాచారం. సెల్వం చేసిన గాయాలతో మరింత ఆరోగ్యం విషమించడంతో ఏం చేయాలో అర్థం కాక హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా తరుణి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు టైఫాయిడ్‌ జ్వరంతోనే తరుణి మృతి చెందిందని, సరైన సమయంలో వైద్యం చేస్తే బతికేదని వైద్యులు పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను నమ్మి కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న వీరసెల్వంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...