హైదరాబాద్ లో దారుణం..GHMC కార్మికురాలని దారుణంగా హత్య చేసిన దుండగులు

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జి హెచ్ ఎం సి మహిళ కార్మికురాలు హత్యకు గురైంది. జి హెచ్ ఎం సి లో మహిళ కార్మికురాలుగా పని చేస్తున్న లక్ష్మమ్మ (60) గొంతు కోసి హతమార్చారు కొంత మంది గుర్తు తెలియని దుండగులు. హత్య చేసిన అనంతరం నాగమాయ కుంట బస్తీ లో మృతదేహన్ని తరలించినట్లు సమాచారం అందుతుంది.

అంతే కాదు హత్య చేసిన అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు & కాళ్ళకు ఉన్న వెండి కడియాలు ఎత్తుకెల్లారు నిందితులు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో… సంఘటన స్థలాన్ని చిక్కడపల్లి పోలీస్ & క్లూస్ టీమ్ పరిశీలించింది. అనంతరం ఆ మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు… త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.