ప‌బ్‌జి గేమ్ ఆడొద్ద‌న్నందుకు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన భార్య‌..!

గుజ‌రాత్‌కు చెందిన 19 ఏళ్ల వివాహిత‌కు 1 సంవ‌త్స‌రం వ‌య‌స్సు గల బాబు ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆమె ఇటీవ‌లే ప‌బ్‌జి గేమ్‌కు బాగా అడిక్ట్ అయింది.

ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌.. సంక్షిప్తంగా ప‌బ్‌జి.. ఇప్పుడీ గేమ్ ఎంత మందిని బానిస‌లుగా మార్చిందో అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం పిల్లలు, యువ‌త ఈ గేమ్ బారిన ప‌డి గంట‌ల త‌ర‌బ‌డి అందులోనే కాల‌క్షేపం చేస్తున్నారు. త‌మ చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతుందో కూడా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడీ గేమ్ మానవ సంబంధాల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. ఈ గేమ్ కార‌ణంగా కుటుంబ స‌భ్యులు విడిపోతున్నారు. తాజాగా ఓ భార్య ప‌బ్‌జి గేమ్ ఆడేందుకు త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

గుజ‌రాత్‌కు చెందిన 19 ఏళ్ల వివాహిత‌కు 1 సంవ‌త్స‌రం వ‌య‌స్సు గల బాబు ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆమె ఇటీవ‌లే ప‌బ్‌జి గేమ్‌కు బాగా అడిక్ట్ అయింది. దాంతో బాబును చూసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం చూపించ‌సాగింగి. దీంతో ఆమె భ‌ర్త విసిగిపోయి ఆమెను ప‌బ్‌జి ఆడ‌వ‌ద్ద‌ని మంద‌లించాడు. అయితే భ‌ర్త త‌న గేమ్‌కు అడ్డుగా ఉన్నాడ‌ని భావించి ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

అలా ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమై అభ‌యం 181 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది. అయితే ఆ సంస్థ వారు ప‌బ్‌జి బారిన ప‌డ్డ వారి అడిక్ష‌న్‌ను త‌గ్గించేందుకు ప‌నిచేస్తారు. కానీ ఈమె అలా కాకుండా త‌న భ‌ర్త నుంచి త‌న‌కు విడాకులు ఇప్పించాలని వారిని కోరింది. అయితే వారు ఆమెకు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఆమె విన‌లేదు. ఈ క్ర‌మంలో ఆమె త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంత‌రం త‌నకు ప‌బ్‌జిలో ఫ్రెండ్ అయిన మ‌రో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వారి కుమారుడు ఎవ‌రి ద‌గ్గర ఉండాల‌న్న విష‌యం కోర్టు ఇంకా తేల్చ‌లేదు. ఏది ఏమైనా.. ప‌బ్‌జి గేమ్ మాత్రం మాన‌వ సంబంధాల‌ను మంట గ‌లుపుతుంద‌ని మ‌న‌కు మ‌రోసారి రుజువు చేసింది.. ఇక‌నైనా ఈ గేమ్ పై ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది..!