ఫేక్ సర్టిఫికెట్స్ ముఠాను పట్టుకున్న మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు

-

నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను పట్టుకున్నారు మాదాపూర్ ఎస్వోటి పోలీసులు. భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మంది ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.18 యూనివర్సిటీ లకు సంబందించినవి ఫేక్ సర్టిఫికేట్స్ ఈ గ్యాంగ్ తయారు చేస్తుందన్నారు.కేపిహెచ్ పి కి చెందిన వెంకటేశ్వర్ రావు కంప్లైంట్ తో ఈ ముఠా గుట్టు వెలుగు లోకి వచ్చిందన్నారు.

ఈ ముఠా సింగిల్ సిటింగ్ లో 10,ఇంటర్,డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ అందిస్తున్నట్లు తెలిపారు.డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ 50 వేలకు,బీటెక్ సర్టిఫికేట్స్ లక్ష 50 వేల నుంచి 2లక్షల 50 లక్షల వరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లుగా తేలిందన్నారు.ఈ ముఠా ఉత్తరప్రదేశ్,తోపాటు 13 రాష్ట్ర యూనివర్సిటీ ల సర్టిఫికేట్స్ తయారు చేసిందన్నారు సిపి.ఈ ముఠా నుంచి ఇప్పటివరకు 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని తెలిపారు.కొంత మంది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుందన్నారు.నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్,4 ఫేక్ స్టాంప్స్,CPU లు,బ్యాంక్ కార్డ్స్ ,ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సిపి స్టీఫెన్ రవీంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news