వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.3 వేలు ఇస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. భద్రాచలంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వరద బాధితుల్ని జగన్ ఆదుకోలేదు.. జగన్ ఎంతో తెలివైనవాడు.. ఓటు కోసం మూడువేలు ఇస్తాడన్నారు. నాడు కరకట్ట కట్టడం వలన ఎంత పెద్ద వరద వచ్చిన భద్రాచలం సురక్షితంగా ఉందని.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకవడం వలన విలీన మండలాలు ముంపునకు గురి అయ్యాయని తెలిపారు.
ఇంత వరద వస్తుందని ఊహించలేదని దద్దమ్మ మంత్రులు చెప్పడం దౌర్భాగ్యమని.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగారని ఆగ్రహించారు. 25 మంది ఎం.పి.లు రాజీనామా చేయండి, కాకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయండని.. పోలవరం ఎందుకు పూర్తికాదో చూస్తానని సవాల్ విసిరారు. అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజల్లో వెలుగు నింపుతానని.. పోలవరం నిర్వాసితులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.
బాధితులకు టిడిపి కి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.