‘నీ భార్యను కొట్టు.. వీడియో కాల్​ చేసి చూస్తా..’ ప్రేయసి పైశాచికత్వం

ఓ మహిళ తన భర్తతో విడిపోయి వేరేగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధంగా మారింది. అంతటితో ఆగకుండా ఆ మహిళ.. తన ప్రియుడికి కాల్ చేసి నీ భార్యను కొట్టు.. నేను వీడియో కాల్​లో చూస్తానంటూ పైశాచికంగా ప్రవర్తించింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్​ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా సాగిపోతున్న వీరి కాపురంలోకి ఓ మహిళ చిచ్చుపెట్టింది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న హరిపర్వత్​కు చెందిన ఓ మహిళ.. రాబిన్​కు పరిచయమైంది. తన భర్తతో జరుగుతున్న గొడవలు గురించి రాబిన్​కు చెప్పింది. ఆ మహిళకు రాబిన్ రూ.1,000 సాయం చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఇంకా పెరిగి.. ఫోన్​లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది.

“నా భర్త ఇంటికి రావడం మానేశాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. పిల్లలను కూడా కనీసం పట్టించుకోవట్లేదు. నా భర్త రాబిన్ ఇంటికి వచ్చేటప్పుడు.. అతడి ప్రియురాలి వీడియో కాల్ చేసి నన్ను కొట్టమని ప్రోత్సహిస్తోంది. నా భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను ట్రాప్ చేసి.. డబ్బులు గుంజుకుంటున్నారు. యువకులతో సన్నిహితంగా ఉండి డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వమని చెబితే.. అత్యాచారం కేసు పెడతారు. వారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతకుముందు వారు ఓ యువకుడు, ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి, మరొ ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం కేసులు అన్యాయంగా పెట్టారు.”  – బాధితురాలు