కొడుకు చేసిన అప్పును తీర్చేందకు ఆ తల్లి 24 మందిని మోసగించింది..!

-

పిల్లలు తప్పటడుగులు వేస్తే వారిని మందలించి సరైన మార్గాల్లో నడిపించేది వారిని మరోసారి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతారు. కానీ.. ఓ తల్లి తన కొడుకు వ్యవనాలకు అలవాడు పడిని పోగొట్టుకున్న కోట్ల డబ్బులను అప్పులు తీర్చేందుకు ఆమె ఏకంగా 24 మందిని మోసం చేసి జైలులో ఊచలు లెక్కపేడుతోంది. అధిక వడ్డీ ఇస్తానని చెప్పి రూ. 2 కోట్లను దోచుకున్న ఘటన ముంబయిలో జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు..

బ్యూటీ పార్లర్‌ నడుపుతూ..

ముంబయిలోని ములంద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముండే రూపాల్‌ పాండ్య అనే మహిళ కుమారుడు ఇషాన్‌ పెళ్లి తరువాత దుబాయ్‌లో స్థిరపడ్డాడు. చెడు అలవాట్లతో పాటు జూదం అలవాటున్న ఇషాన్‌ దుబాయ్‌లోని క్యాషినోలో రూ. 2 కోట్ల మేరకు పోగొట్టుకున్నాడు. దీంతో తన కుమారుడు కూరుకున్న అప్పుల ఊబిలోంచి బయటకు తీసేందుకు ఆ తల్లి రూపాల్‌ మోసాలకు పాల్పడింది.

బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న ఆమె ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ తవ వద్దకు వచ్చే కస్టమర్లు, ఇరుగుపొరుగు వారి వద్ద అప్పులు చేసింది. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు తీసుకుంది. తాను తిరిగి ఇస్తానన్న సమయం మించిపోయినా ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో నిలదీశారు. తాము మోసపోయామని గ్రహించి 24 మంది బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news