కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్.. ఒకరు మృతి

ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హెలికాప్టర్ నడుపుతున్న ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్​ ప్ర​దేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది.

గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ హెలికాప్టర్ ఇండియన్ ఆర్మీకి చెందినదిగా గుర్తించి వారికి సమాచారం అందించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.