దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు..గుబులుపుట్టిస్తున్న గణాంకాలు

-

ఆన్‌లైన్ మోసాలు : టెక్నాలజీ ఎంత పెరిగిందో.. మోసం చేయడం కూడా అంతే సులువు అయింది. చదువుకున్న వారు, చదువుకోని వారు అని తేడా లేకుండా అందరూ సైబర్‌ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారు. దేశంలో ఆన్‌లైన్ మోసాల కేసులు చాలా వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు ఈ కేసులు నమోదవుతున్నాయి. గత మూడేళ్లలో 39 శాతం భారతీయ కుటుంబాలు ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.. వీరిలో 24 శాతం మంది మాత్రమే తమ డబ్బును తిరిగి పొందారట…

ఆన్‌లైన్ మోసాలు
ఆన్‌లైన్ మోసాలు

 

కార్డుల మోసాలే ఎక్కువ..

లోకల్ సర్కిల్స్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.. సర్వేలో 23 శాతం మంది ప్రజలు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసానికి గురైనట్లు చెప్పారు. 13 శాతం మంది తాము కొనుగోలు, అమ్మకం, క్లాసిఫైడ్ సైట్ వినియోగదారుల ద్వారా మోసపోయామని చెప్పారు. సర్వే ప్రకారం.. 13 శాతం మంది ప్రజలు తమ నుంచి వెబ్‌సైట్ ద్వారా డబ్బు తీసుకున్నారని కానీ ఉత్పత్తిని పంపలేదని చెప్పారు. 10 శాతం మంది ఏటీఎం కార్డు మోసానికి గురైనట్లు పేర్కొన్నారు.. మరో 10 శాతం మంది బ్యాంకు ఖాతా మోసానికి గురయ్యారని చెప్పారు. 16 శాతం మంది తాము కొన్ని ఇతర పద్ధతులను అనుసరించడం ద్వారా మోసపోయామని చెప్పారు.

సర్వే చేసిన కుటుంబాలలో 30 శాతం మంది కనీసం ఒక సభ్యుడు ఆర్థిక మోసానికి గురైనట్లు తెలుస్తోంది.. అదే సమయంలో 9 శాతం మంది తమ కుటుంబంలోని చాలా మంది సభ్యులు ఈ రకమైన మోసానికి గురయ్యారని చెప్పారు. 57 శాతం మంది తాము, వారి కుటుంబంలోని ఎవరైనా ఈ రకమైన మోసానికి గురికాకుండా రక్షించబడ్డామని చెప్పారు. దేశంలోని 331 జిల్లాల నుంచి 32 వేల మంది అభిప్రాయాన్ని ఈ సర్వేలో తీసుకున్నారు. వీరిలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.

సర్వే చేయబడిన వారిలో 39 శాతం మంది క్లాస్ I నగరాలకు చెందినవారు. 35 శాతం మంది క్లాస్ II నుంచి, 26 శాతం మంది క్లాస్ III, IV నగరాలు గ్రామీణ జిల్లాలకు చెందినవారు.

దీన్ని బట్టి తెలిసిందేంటంటే.. మోస పోవడానికి ప్రాంతంతో సంబంధం లేదు. అప్రమత్తతే అవసరం.. ఈరోజుల్లో సైబర్‌ నేరగాళ్లు ఎలా తయారయ్యారంటే.. బ్యాంకు నుంచి కాల్ చేసినట్లు చేస్తారు.. వాళ్లే చెప్తారు.. ఎవ్వరికీ సీవీవీ, పిన్‌ నెంబర్‌ చెప్పొద్దు అని.. మనం వాళ్లు నిజంగానే బ్యాంకు నుంచి చేశారనుకుంటాం.. కానీ అసలు మోసగాళ్లు వారే అని తెలియదు.. ఇక క్రెడిట్‌ కార్డులు వాడే వారికి మీ క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతాం అని ఫోన్‌ చేస్తారు..నిజమే అనుకోని వాళ్లు అడిగిన వివరాలు చెప్పారంటే అంతే సంగతులు..!

Read more RELATED
Recommended to you

Latest news