ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్ల కి ఇప్పటికే ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. 2020లో మే నెల లో ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజెన్ల కి గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకు వచ్చింది. దీనిపై ఎక్కువ వడ్డీని కూడా అందించేది. లిమిటెడ్ పీరియడ్ FD ఇది. ఈ స్కీమ్ గడువు తేదీని బ్యాంకు ఎక్స్టెండ్ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు 2 వారాల కిందట కూడా ఈ స్కీమ్ లాస్ట్ డేట్ ని ఎక్స్టెండ్ చేసింది. మొదట ఈ డేట్ 2023, ఏప్రిల్ 7 వరకే ఉండేది. కానీ ఇప్పుడు 2023, అక్టోబర్ 31 వరకు చేసింది. సీనియర్ సిటిజెన్లకు ఈ స్కీమ్ కింద 7.5 శాతం వడ్డీ వస్తోంది.

ఇందులో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చెయ్యాలి. ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు కాల వ్యవధి ఉండాలి. ఐసీఐసీఐ గోల్డెన్ ఇయర్స్ FD కింద రెసిడెంట్ సీనియర్ సిటిజెన్ కస్టమర్లు 0.10 శాతం మేర వడ్డీ ఎక్కువ వస్తుంది. స్కీము 2020, మే 20 నుంచి అమల్లో ఉంది. ఫ్రెష్ డిపాజిట్లను ఓపెన్ చేస్తే స్కీం పీరియడ్‌కు సంబంధించి డిపాజిట్లను రెనివల్ చేస్తే అడిషనల్ రేటు ఉంటుంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

సింగిల్ FD ని ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ నుండి ఓపెన్ చేసుకోవచ్చు. రూ. 2 కోట్లకు లోబడిన డిపాజిట్లకు మాత్రమే అవకాశం. ప్రీమెచ్యూర్ విత్‌డ్రా కూడా ఉంటుంది. సీనియర్ సిటిజెన్ల సాధారణ వడ్డీ రేట్ల గురించి చూస్తే.. 7 నుంచి 14 రోజుల్లో ముగిసే FD పై సాధారణ ప్రజలకు 3 శాతం వస్తోంది. అదే సీనియర్ సిటిజెన్లకు 3.50 శాతం వడ్డీ లభిస్తుంది. 15 నుంచి 18 నెలలు, 18 నెలల నుంచి రెండేళ్ల వాటి పైన అయితే సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news