హైదరాబాద్ పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన జరిగిన రైన్ బజార్ రౌడి షీటర్ సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి హత్య కేసును ఛేదించారు పాతబస్తీ పోలీసులు. 6మంది నిందితులను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ తో కలిసి అరెస్ట్ చేశారు భవాని నగర్ పోలిసులు. నిందితుల వద్ద నుండి 4 కత్తులు, 2 ద్విచక్రవాహనాలు,5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
వరుస హత్యలు, ప్రతికారాలు, అనుమానాలే ఈ హత్యకు గల కారణంగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. 4వ తేదీ హత్యకు గురైన సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి రైన్ బజార్ రౌడీ షీటర్. అతని తమ్ముడు ఖుస్రు తో కలిసి 2014లో జవహర్ నగర్ ps రౌడీ షీటర్ ఫర్రు సోదరుడు నవాజ్ ను హత్య చేశాడు. తిరిగి ఫర్రు , సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి తమ్ముడు కుస్రును హతమార్చి తమ్ముడి హత్య ప్రతీకారం తిర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో 2021లో ఫర్రు రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు.
ఆ సమయంలో మృతుడు సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి దుబాయిలో ఉన్నాడు. ఫర్రు హత్య వెనకాల మృతుడు సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి ఉన్నాడని అనుమానంతో ఫర్రు అనుచరులు 1,ఆనంద్ అగర్వాల్,2 మొహమ్మద్ అబ్దుల్ ఆన్సర్,3మీర్జా ఫైజ్ అలీ బైగ్,4సయ్యద్ యూసుఫ్,5 అజర్,6మొహమ్మద్ షోయబ్ యూర్ రెహ్మాన్, మరో ఇద్దరు అబ్దుల్ ఘని, మొమిన తో కలిసి హత్యకు ప్లాన్ వేశారు. మృతుడు దుబాయ్ నుండి తిరిగి రాగానే రెక్కీ నిర్వహించారు.
ఈ నెల 4వ తేదీన మృతుడు సయ్యద్ బక్తీయర్ అఘా ఖురేషి భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆన్మోల్ హోటల్ సమీపంలో వద్దకు రాగానే నిందితులు కత్తులతో దాడి చేసి హతమార్చి పారిపోయారు.హత్య కేస్ నమోదు చేసుకున్న భావాని నగర్ పోలీసులు దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ 6మంది నిందితుల్లో A1,A2,A3,A5, నేర చరిత్ర కలిగిన వారే.