విజయవాడ లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..!

విజయ నగరం స్థానిక కస్పా హైస్కూల్ సమీపంలో ఒక గ్రూప్ హౌస్ లో మేడ మీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూ టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

కస్పా హై స్కూల్ సమీపంలో ఉన్న గ్రూప్ హౌస్ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.