తెలంగాణలో దారుణం..మతిస్థిమితం లేని బాలికపై సర్పంచ్ లైంగిక దాడి !

-

తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని మైనర్ బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండాలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తాండ సర్పంచ్ శంకర్ ఇంటికి టీవీ చూడడానికి మైనర్ బాలిక..ఎప్పటి లాగే వెళ్లింది.

అయితే.. నిన్న సర్పంచ్ ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో సర్పంచ్ ఇంటికి వెళ్లారు బాలిక కుటుంబ సభ్యులు. ఇక ఈ నేపథ్యంలోనే.. ఇంటి మెడపై బాలిక పై అత్యాచారయత్నం చేస్తుండగా గ్రహించారు బాలిక కుటుంబ సభ్యులు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు…సర్పంచ్ కు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం పరారీలో నిందితుడు సర్పంచ్ ఉన్నాడు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news