మా కొడుకును చంపేయండి.. హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు

-

స్కూల్‌కెళ్లే బాలికలపై దారుణంగా అత్యాచారం చేసి చంపేసి.. బావిలో పడేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని చివరకు తన కన్న తల్లిదండ్రులే చీదరించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఉదంతం తెలియగానే.. వాళ్లు ఊరి నుంచి వెళ్లిపోయారు.

మా కొడుకు చేసింది చిన్ననేరమేమీ కాదు. చాలా పెద్ద నేరం. వాడు చేసిన నేరానికి ఉరిశిక్ష కూడా సరిపోదు. అంతకంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే వేయండి.. వాడి వల్ల ఊళ్లో, బంధువుల వద్ద తలెత్తుకోలేక పోతున్నాం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు.

స్కూల్‌కెళ్లే బాలికలపై దారుణంగా అత్యాచారం చేసి చంపేసి.. బావిలో పడేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని చివరకు తన కన్న తల్లిదండ్రులే చీదరించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఉదంతం తెలియగానే.. వాళ్లు ఊరి నుంచి వెళ్లిపోయారు. ఊరి ప్రజలకు కనిపిస్తే ఎక్కడ తమ ప్రాణాలు తీసేస్తారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అభంశుభం తెలియని అమ్మాయిలను దారుణంగా చంపేయడం పాపమని.. శ్రీనివాస్ రెడ్డి అన్న మీడియాకు తెలిపాడు.

నా కొడుకు ఇంత దుర్మార్గుడని ముందు తెలియదు. అతడి ప్రవర్తనపై నాకు ఏనాడూ అనుమానం రాలేదు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసేవాడు. చాలా ప్రాంతాలు తిరిగేవాడు. అప్పుడప్పుడు ఊరికి వచ్చేవాడు. కానీ.. వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని మాకు ఏనాడూ అనుమానం రాలేదు. మాకు ముందే తెలిసి ఉంటేనా.. వాడిని మేమే చంపి ఉండే వాళ్లం. అటువంటి కొడుకు ఉంటే ఎంత.. లేకుంటే ఎంత. వాడి వల్ల ఇప్పుడు మా బతుకు ఆగమైపోయింది. ఊళ్లోకి అడుగు కూడా పెట్టలేకపోతున్నాం.. అంటూ శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాల్‌రెడ్డి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

నా కొడుకు కారణంగా మా కుటుంబమే ఆగమైంది. మాకు దుర్భర పరిస్థితి తలెత్తింది. వాడిని చంపేస్తేనే చనిపోయిన అమ్మాయిల ఆత్మకు శాంతి కలుగుతుంది. నా కొడుకు ప్రవర్తనపై ఏనాడూ అనుమానం రాలేదు. వేములవాడకు చెందిన ఓ అమ్మాయితో మాత్రం వాడు తిరిగేవాడు. అయితే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ అమ్మాయితో నేను చాలా సార్లు మాట్లాడాను. కానీ.. వాడు ఇలాంటి దౌర్భాగ్యపు పని చేస్తాడని ఏనాడూ అనుకోలేదు.. అంటూ శ్రీనివాస్ రెడ్డి తల్లి తెలిపారు.

అసలు వాడు మా తమ్ముడే కాడు. వాడు ఎవడో. వాడిని చంపేయండి. వాడు చేసింది చిన్న నేరం కాదు. పెద్ద నేరం. వాడు మా ఇంట్లో పుట్టడమే మేం చేసిన నేరమా. మా ఇల్లును కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఎక్కడుండాలి. ఇప్పుడు రోడ్ల మీద బతకాల్సి వస్తోంది.. అంటూ శ్రీనివాస్ రెడ్డి అన్న వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version