పెళ్లి సంబంధాలకు చెడగోడుతున్నాడు అని అన్నను చంపేశారు…!

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి సంబంధాలకు చెడకొడుతున్నాడని ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. జిల్లాలోని… హిరమండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని పిండ్రువాడ కాలనీలో గత కొన్ని రోజులుగా తమకు వస్తున్న పెళ్లి సంబంధాలను కరణం తిరుపతి రావు అనే వ్యక్తి చెడగోడుతున్నాడు అని అతనికి వరుస అన్న అయ్యే వ్యక్తిపై తమ్ముళ్ళు దాడి చేసారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కరణం తిరుపతి రావు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతిరావు పై దాడికి కాశీ అనే మాజీ సైనికుని బంధువులు పాల్పడ్డారు. కాశీ బంధువులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అతను ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు అతనిని హతమార్చిన వారిని అరెస్ట్ చేసి… దర్యాప్తు చేస్తున్నారు.