పెళ్లైన ఐదు రోజులకే కోడలి బట్టలు విప్పి.. బయటకు గెంటేసిన అత్తమామ

పెళ్లంటనే.. ఇప్పుడు అమ్మాయిలకు పెద్ద సమస్యగా మారింది. కొంతమంది అయితే 25 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ఎలాగోలా.. కంప్రమైజ్‌ అయి పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వేధింపులు వారికి ఇంకా పెద్ద తలనొప్పిగా మారిపోతున్నాయి. పెళ్లి జరిగే వరకు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత మనుషులు చాలా త్వరగా మారిపోతున్నారు. డబ్బు మోజులో పడి బంధాలను, మానవత్వాన్ని పూర్తిగా మంటకలిపేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే.. నివ్వెరపోవాల్సిందే. పెళ్లై 5 రోజులు కూడా కావడం లేదు ఆమెకు నరకం చూపించారు. ఆమె బట్టలు విప్పించి..ఊరి మహిళ ముందు పరువు తీశారు. చివరకు ఆమెపై ఏం ముద్రవేశారో తెలుసా.

ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజ్‌నగరిలో ఓ నవ వధువుపై ఆమె అత్తమామలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు శీల పరీక్ష పెట్టారు. అప్పటికి వాళ్లు సంతృప్తి చెందకపోవడంతో కోడలిని ఇంట్లో నుంచి గెంటేశారు. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని 5రోజుల్లో బయటకునెట్టేయడంతో బాధితురాలు బోరుమని విలపిస్తుంది. న్యాయం చేయమని మెట్టినింటి చుట్టూ తిరిగింది. అత్తమామలు కనికరించకపోవడంతో ఆ కోడలు తల్లి ఇంట్లో నివసిస్తోంది.

అనుమానంతో ఆమెను అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు. అదనపు కట్నం కోసం చివరకు కోడలిని నపుంసకురాలు అని ముద్రవేశారు. కోడలు బట్టలు విప్పి నపుంసకురాలు అంటూ మహిళపై ముద్రవేసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. పెళ్లి చేసుకొని వారం రోజులు కూడా గడవక ముందే అత్త,మామలు అదనపు కట్నం కోసం తనపై నపుంసకురాలు అని ముద్రవేసి ఇంటి నుంచి గెంటేశారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై ఆరోపణలు చేసిన అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

ఫతేహాబాద్‌లోని కొట్రా గ్రామానికి చెందిన యువతికి ఇరాదత్‌నగర్‌ గ్రామంలో నివసించే యువకుడితో మే 20న వివాహం జరిగింది. కాళ్లకు పెట్టిన పారాణి ఆరకముందే అత్త,మామల వరకట్న కోసం ఆమెను నడిరోడ్డున పడేశారు. నపుంసకురాలిగా ముద్రవేయడమే కాకుండా అత్తమామలు బాధితురాలి బట్టలు విప్పి తనిఖీ చేసి, ఆపై నపుంసకుల గురించి మాట్లాడారు. ఈ ఘటనపై బాధితురాలు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు మెట్టినింటి వాళ్లతో ప్రాణహాని ఉందని..చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది.

అత్త,మామ వరకట్నం కోసం తనపై నపుంసకురాలిగా ముద్రవేయడమే కాకుండా దుస్తులు విప్పి తనను నగ్నంగా చూశారని చెప్పింది. అత్తమామలపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ పోలీస్ కమిషనర్ కేశవ్ చౌదరి ఎదుట న్యాయం చేయాలని వేడుకుంది. ఇలా ఉంది సమాజం.. ఇప్పుడు ఆమె పరిస్థతి ఏంటి.. ఇంత జరుగుతుంటే..ఆ భర్త ఏం చేస్తున్నాడో.!