పెంపుడు కుక్కను కుక్క అన్నందుకు పొరుగింటి వ్యక్తిని చంపేసిన యజమాని..

-

పెంపుడు జంతువులను పెంచుకునేవారికి.. వాటిపై చాలా ప్రేమ ఉంటుంది. వారికి అవి జంతువుల్లా అస్సలు అనిపించవు..మనుషుల్లానే.. చూస్తారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులపై అమితమైన ప్రేమను పెంచుకుంటారు.. అలా పెంచుకునే.. కుక్కను కుక్క అన్నందుకు ఇంటిపక్కన వ్యక్తిని చంపేశాడు ఆ యజమాని. షాకింగ్‌గా, ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమే.. తమిళనాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తమిళనాడు జిల్లా దిండిగల్‌ ఉలగంపట్టి కొట్టం, తాడికొంబు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డేనియల్, విన్సెంట్ నివాసితులు. వాళ్లకు ఒక పెంపుడు కుక్క ఉంది.. డేనియల్‌ ఆ కుక్కను ఎవరైనా కుక్క అని అంటే ఊరుకోడు.. కుటుంబంలో వాళ్లు, ఇరుగుపొరుగు వారు ఎవరైనా సరే.. బాగా ఆగ్రహానికి గురువుతాడు.. కుక్క అని పిలవద్దు అని అంటాడట.. కుక్కను పెట్టిన పేరుతో పిలవాల్సిందిగా కోరతాడు.. ఇప్పటికే ఈ విషయం ఇరుగుపొరుగు వారికి చాలా సార్లు చెప్పాడు.. అయినా ఎవడికి గుర్తుంటుంది..నీ ఇంట్లో కుక్కను నువ్వు ఏం పేరుపెట్టుకున్నావో.. అయినా డేనియల్‌ మాత్రం కుక్క అంటే ఊగిపోతాడు..
అతని ఇంటిపక్కన వ్యక్తి.. రాయప్పన్‌.., 62, డేనియల్‌కు బంధువు కూడా.. ఒకరోజు రాయప్పన్ తన పొరుగు పొలంలో నీటి పంపును ఆపివేయమని అతని మనవడు కాల్విన్‌కు చెప్పాడు.. అలాగే కుక్క వస్తుందని తన మనవడికి ఒక కర్రను కూడా తీసుకురా అన్నాడు.. పాపం అలా అనడమే రాయప్పన్‌ చేసిన తప్పు అయింది.. రాయప్పన్‌ మళ్లీ కుక్క అనడంతో పక్కనే ఉన్న డేనియల్‌కు మండింది. అతను చాలా కోపోద్రిక్తుడయ్యాడు.. రాయప్పన్‌ ఛాతీపై కొట్టాడు. నీకు ఎన్నిసార్లు చెప్పా..కుక్క అని పిలవద్దు అని గట్టిగా అరిచాడు..
రాయప్పన్‌ను కొట్టినప్పుడు, అతను వెంటనే నేలపై పడిపోయాడు. స్పృహ తప్పిన రాయప్పన్‌ను ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను చనిపోయాడు.. అంతే రాయప్పన్‌ మరణవార్త తెలియడంతో.. డేనియల్‌ కుటుంబం జంప్.. పోలీసులు డేనియల్‌ కోసం గాలించారు. మరుసటి రోజు, పోలీసులు ఫాతిమా, ఆమె కుమారులను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news