భోలే బాబాను ప్రసన్నం చేసుకోవాడనికి ఆరేళ్ల బాలుడిని హత్య చేసిన యువకులు..

-

మూఢనమ్మకాల మాటున మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. కన్నకూతుళ్లను దేవడికి బలిచ్చారు ఓ తల్లిదండ్రులు..అప్పుడా వార్త యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అలాంటివి ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆరేళ్ల బాలుడిని చంపేశారు ఇద్దరు వ్యక్తులు.. దిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. సీఆర్​పీఎఫ్​ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో పనికి చేరింది. వారికి ఓ ఆరేళ్ల కొడుకు ఉన్నాడు..శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో.. భవనానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. అతడి గొంతు కోసేసి ఉండటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న నిందితులను వారందరు పట్టుకున్నారు. మరణించింది.. తమ బిడ్డే అని తెలిసి.. ఆ వలస కుటుంబం బోరున విలపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశారు.

నిందితులు.. బిహార్​కి చెందిన 23ఏళ్ల విజయ్​ కుమార్​, 21ఏళ్ల అమర్​ కుమార్‌గా గుర్తించారు.​. “నిందితులు ఇద్దరు కలిసి గాంజా కొట్టేవారు. వారు కూడా భవన నిర్మాణంలో పనిచేసిన కూలీలే. గంజా కొడుతున్న వారిద్దరని స్థానికులు మందలించారు. దాంతో వారిద్దరికి కోపం వచ్చి..ఇక తన కలలోకి భోలే బాబా వచ్చాడని, ఓ బాలుడి మెడ కోసేయాలని ఆదేశించినట్టు నిందితుల్లో ఒకడు చెప్పాడు. ఈ క్రమంలోనే 6ఏళ్ల బాలుడిని చంపేశామని వాళ్లు తెలపడంతో. పోలీసులు షాక్‌ అయ్యారు..

శనివారం రాత్రి.. బాలుడు తన షెడ్డుకు వెళుతుండగా.. అతడిని ఆ ఇద్దరు పిలిపించారు. వారిద్దరు ముందే తెలుసు కాబట్టి.. బలవంతం లేకుండానే వారి వద్దకు ఆ బాలుడు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడిని చంపేశారని పోలీసులు తెలిపారు. నిందితులపై బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గా పూజల వేళ త్యాగాలు చేస్తే.. శాంతి లభిస్తుందని ఆ ఇద్దరు తరచూ మాట్లాడేవారని వాళ్లు తెలిపారు. అనవసరమైన నమ్మకాలతో నిండు ప్రాణం తీశారు. వీరిని కఠినంగా శిక్షించాలని విషయం తెలిసిన నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...