మ‌రో ఇద్ద‌రి ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న టిక్‌టాక్.. ఏం జ‌రిగిందంటే..?

-

ప్రస్తుతం ఆన్‌లైన్ యాప్స్ హవా నడుస్తోంది. అయితే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందర్నీ కట్టిపడేస్తున్నయాప్.. టిక్‌టాక్. ఇందులో షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపైతే.. టిక్‌టాక్‌ వ్యసనంగా మారడంతో ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. కొంద‌రు కొన్ని వీడియోల‌ను సాహసం చేస్తూ తీస్తుంటారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకొని మరీ వీడియోలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే బెంగళూరులో ఇద్ద‌రు యువ‌కులు రైలు ప‌ట్టాల‌పై టిక్‌టాక్ వీటియో తీస్తు ప్రాణాలు కోల్పోయారు.

ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. బయప్పనహళ్లి రైల్వేస్టేషన్‌ పరిధిలో శివరామ్‌ కారంత నగర రెండో స్టేజీ సమీపంలోని శ్రీరామపుర రైల్వేగేటు రైలు వస్తుండగా పట్టాలపై అఫ్తాబ్‌ షరీఫ్‌ (19), మహమ్మద్‌ మతీమ్‌(23), జనీవుల్లా (21)లు కలిసి టిక్‌టాక్‌ కోసం వీడియో తీయసాగారు.వీరిద్దరూ పట్టాలపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీస్తున్నాడు. కోలారు నుంచి బెంగళూరుకు వస్తున్న ప్యాసింజర్‌ రైలు వస్తున్నా.. అలాగే వీడియోలో లీనమయ్యారు. చివరకు రైలు ఢీకొనడంతో అఫ్తాబ్‌ పట్టాల పక్కలోని విద్యుత్‌ స్తంభానికి తగిలి, మతీమ్‌ 20 అడుగుల దూరంగా ఎగిరిపడి చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version