ప్రేమ కాదు కామవాంఛ … వికారాబాద్ బాలిక రేప్, మర్డర్ కేసులో విస్తూపోయే నిజాలు

వికారాబాద్ మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో విస్తూపోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రియుడు మహేందర్ తన కామవాంఛ తీర్చుకునే క్రమంలో బాలికను హత్య చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. బాలిక సహరించకపోవడంతో తోపులాట జరిగిందని… బలవంతంగా కొట్టడంతో పక్కనే వేపచెట్టుకు బాలిక నుదిటి భాగం తాకడంతో స్పృహ కోల్పోయిందని… ఇలా స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుడు తన కామవాంఛ తీర్చుకునేందుకు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ వెల్లడించారు. బాలికలో చలనం లేకపోవడంతో గొంతునులిమి ప్రియుడు హత్య చేశాడని వెల్లడించారు. 

బాలిక ఆమె ప్రియుడు ఇళ్లు పక్కనే ఉండటం.. వారిద్దరికి ముందు నుంచే పరిచయం ఉందని, కలుద్దామని పిలవడంతోనే బాలికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు. అయితే వీరిద్దరు చనువుగా ఉండటం ఇరుకుటుంబాలకు తెలియడంతో.. మళ్లీ కలిసే అవకాశం ఉండనే ఉద్దేశ్యంతో తన కామవాంఛ తీర్చుకోవాలని బాలికను బలవంతం చేసే క్రమంలో ఈ హత్య చోటు చేసుకుంది. క్లూస్ టీం, టాస్క్ ఫోర్స్, ఎస్ బీ విభాగాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి కేసును చేధించామని.. త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.