దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఆభరణాల వ్యాపారికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా వారిద్దరు వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. తన బండారం బయటపడటంతో ఆ మహిళ ఇంట్లో ఉన్న కోటికి పైగా విలువైన ఆభరణాలు, డబ్బు తీసుకుని పారిపోయింది.
ఈ విషయంపై ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తనపై కేసు వెనక్కి తీసుకోకపోతే భర్త తల్లిదండ్రుల న్యూడ్ వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను వారింట్లో ఉన్నప్పుడు అత్తామామకు తెలియకుండా వారి గదిలో కెమెరాలు పెట్టినట్లు చెప్పింది. వెంటనే ఆ వ్యాపారి ఈ విషయంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి భార్యను, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.