విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలి: వివేకా కుమార్తె పిటిషన్‌

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని.. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

ఇటీవలే మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. హత్య కేసులో నిందితులైన A2 సునీల్ యాదవ్, A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు బెయిల్ మంజూరు చేయలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లను నుంచి ఇప్పటికే సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినింపించారు.

సీబీఐ చెబుతున్నట్లు సాక్షులను ప్రభావితం చేస్తారనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. హత్య కేసులో నిందితులు పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఎటువంటి షరతులు విధించి అయినా నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిందితులు జైళ్లో ఉంటునే సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news