తగ్గని కరోనా కేసులు.. ప్రజలకి తప్పని తిప్పలు..!

-

కరోనా మహమ్మారి వలన ఎంతో మంది ఇప్పటికే సతమతం అయ్యారు. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందా అని అందరు ఎంత గానో ఎదురు చూస్తున్నప్పటికీ ఏ మాత్రం ఆగడం లేదు. నిజంగా ఇది ఒక సమరంలాగ ఉంది. ఏది ఏమైనా వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఇంకా వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది ఇలా ఉంటే వందల్లో మరణాలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా వేల కరోనా కేసులు రోజు నమోదవుతూనే వున్నాయి.

గత 24 గంటల నుండి కరోనా వైరస్ కి సంబంధించి విషయాల గురించి చూస్తే… ఇప్పటికి 42 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 54,76,423 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 42,34,17,030 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో అలానే ఇంకా 405513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 483 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 419470 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది.

గత 24 గంటల్లో మరో 38740 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30468079 మంది కరోనా నుండి డిశ్చార్జ్ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news