నిరుద్యోగులకు సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ గుడ్ న్యూస్ చెప్పారు. CRPFలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల కోసం పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జూన్ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. కంప్యూటర్ బేస్డ్‌టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. ఏపీలో 428 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 307 పోస్టులు ఉన్నాయి.