‘స్మార్ట్ మీటర్స్‌‌తో ఎలాంటి నష్టం లేదు’ : స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్‌

-

టెక్నాలజీకి అనుగుణంగా ఇంధన శాఖలో మార్పులు తీసుకొస్తున్నామని స్పెషల్ సీఎస్‌ విజయానంద్ తెలిపారు. తొలుత ఎలక్ట్రో మెకానికల్ మీటర్స్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీటర్స్ వచ్చాయని, ఇప్పుడు వాటి స్థానంలో స్మార్ట్ మీటర్స్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదని, ఎవరికో లబ్ధి కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వీటిపై కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపారు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి టెండర్లని పిలవడం తప్పితే మార్చే అధికారం లేదు. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు‌ స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయన్నారు విజయానంద్.

అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్ కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం‌ మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం. 13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చ్ నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news