సిఎస్కె కెప్టెన్ చేంజ్.. క్లారిటీ ఇచ్చిన సీఈవో..?

-

మునుపెన్నడూ లేని విధంగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీక్ దశతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సమతూకం లోపించడంతో తీవ్ర విమర్శల పాలు అయింది. 12 మ్యాచ్లు ఆడి కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి చివరికి ఐపీఎల్ లో ప్లే ఆప్ కి అర్హత సాధించి లీగ్ దశ తోనే సరిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

dhoni

ఇక ఈ ఏడాది తొలి జట్టు ఎంపిక విషయంలో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో కూడా విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్సీ మార్పులు చేసే అవకాశం ఉంది అని టాక్ ఊపందుకున్నది ఇలాంటి నేపథ్యంలో స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో చెన్నై జట్టు రికార్డ్ సృష్టించిందని ఇదంతా కేవలం ధోని సారథ్యం తోనే సాధ్యమైందని ఒక్కసారి విఫలం అయినంత మాత్రాన ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారు అని అనుకోవడం పొరపాటు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news