IPL CSK vs LSG : చెన్నైకి మ‌రోసారి నిరాశ‌.. ఉత్కంఠ పోరులో ల‌క్నో విజ‌యం

-

ర‌వీంద్ర జ‌డేజా సార‌థ్యంలో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో సారి నిరాశే ఎద‌రైంది. ఇప్ప‌టికే కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జట్టుపై ఓడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు.. తాజా గా లక్నో సూప‌ర్ జెయింట్స్ పై కూడా ఓట‌మి పాలైంది. 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్ విజ‌యం సాధించింది. కాగ ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఉతప్ప (50), మొయిన్ అలీ (35), శివ‌మ్ దూబె (49), అంబ‌టి రాయుడు (27) తో పాటు జ‌డేజా (9 బంతుల్లో 17), ధోని ( 6 బంతుల్లో 16 నాటౌట్) రాణించారు.

దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్.. నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి.. 210 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్లు.. అవేశ్ ఖాన్, ర‌వి బిష్ణోయ్, అండ్రూ టై 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. కాగ 211 భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగ‌న ల‌క్నో.. కెప్టెన్ రాహుల్ (40), డి కాక్ (61), ఎవిన్ లూయిస్ (23 బంతుల్లోనే 55 నాటౌట్ ) తో పాటు చివ‌ర్లో ఆయూశ్ బ‌దోని ( 9 బంతుల్లో 19 నాటౌట్ ) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గానే.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. చెన్నై బౌల‌ర్లు.. డ్వైన్ ప్రీటోరియ‌స్ 2, బ్రోవో, దేశ్ పాండే ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఎవిన్ లూయిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version